Sunday, November 21, 2010

యిప్లవం నీదమ్మందిరా !


ఓరోరి  కూలి 
ఔరా  హమాలీ 
పల్లెటూరు  వదిలావు 
పట్నానికి  కదిలావు 
పస్తుల్లో  నలిగావు 
రెండుకాళ్ళ  పసువులాగా 
ఎండల్లో తిరిగావు 
కానీలే  యింతే  నా
కరమమని  పనికిరాని 
జనమమని  ఎందుకిలా 
కళ్ళు తేల వేస్తావు 
కాళ్ళు జారవేస్తావు 
బతికుండే  చస్తావు 

యిప్లవం  మేమంటున్నదో 
యిప్పుడైనా  తెలుసుకో 
మనిసిలాగా మసలుకో 
పీడించే కామందు 
ఆడే  ఒక రాబందు - అలాంటోడికి 
సుత్తిపోటే 
కత్తివేటే 
మత్తుదించే  ఒక మందు -- అప్పుడే 
ఆడి  మాయ  సాగదు  ఇక ముందు


యిప్లవం  యేమందిరా 
మనిసికొకటే సావందిరా 
కట్లు తెంచుక  రమ్మందిరా 
కత్తి దూసుక  లెమ్మందిరా 
యిప్లవం  నీదమ్మందిరా

మహాకవి శ్రీశ్రీ - మరోప్రస్థానం 

0 comments:

Post a Comment