Tuesday, March 15, 2011

కదిలి రండి నవభారత నారీమణులారా !



కదిలి రండి నవభారత
నారీమణులారా !
ఓ వీరాంగనలారా !

అలముకొనే చీకటిపై
అరుణారుణ కిరణాలై
కులమత భేధాల గొడవ
వరశుల్క పిశాచి బెడద
కుళ్లగించి పెళ్లగించి
కొత్తబతుకు సాధించగ

కదిలి రండి నవభారత
నారీమణులారా !........

ఆర్ధిక జీవితములోని
అసమానతలణగించగ
ఆగణిత విశ్వాసముతో
ప్రగతిబాట పయనించగ

కదిలిరండి నవభారత
నారీమణులారా ! ........

ఆడది మగవాని చేతి
ఆటవస్తువని ఎంచే
పాతపడిన భావాలను
లోతుగ పాతర వేయగ

కదిలిరండి నవభారత
నారీమణులారా !.......

 
మహాకవి శ్రీశ్రీ కవితలు -మరోప్రస్థానం 

0 comments:

Post a Comment