Friday, March 25, 2011

సమర ధ్వానం

పొంగెత్తుతున్న  
సమర ధ్వానంతో  
అందరిలో   హెచ్చింది ఉత్తేజం .
ఇంతలోనే అవాంతరం వచ్చి
దిగజారి పోయింది ఉద్రేకం. 
సంగర నినాదపు స్థాయీ భేధాలే  
నిర్ణయిస్తాయి ప్రజలగతి  
తుట్టతుదకు మనం  
బానిసలుగా బ్రతకాలా  ? 
లేక  మన యిళ్లకు  మనమే
యజమానులుగానా ?
లెండి ?నిలబడండి ?
అరనిమిషమైనా ఆలసించకండి !
ప్రతిఘటించండి ! 
నికృష్టపు లొంగుబాటుతో
కొనుక్కున్న బ్రతుకెన్నడూ  
బ్రతుకే కాదు  .
శాంతి యెప్పుడూ మన ప్రజల
నిత్చి  గమ్యమే .
కానీ శాంతి
మన ప్రతిఘటనలోని  
మహత్తర సంక్షోభంనుంచి మాత్రమే  
ప్రభవించాలి !  
మూలం : కొమోజో
            మహాకవి  శ్రీ శ్రీ  - మరోప్రస్థానం

0 comments:

Post a Comment