1935లో హిట్లర్
“మూడోరైషే
వేయ్యేళ్ళు సాగుతుంద”న్నాడు
పదేళ్ళ తర్వాత
ఏమన్నాడు వాడు
బెర్లిన్ శిథిలాలక్రింద
ఆ తర్వాత మరో కొన్నేళ్ళకి
మిస్టర్ డల్లేస్
గొంగళిపురుగులాగా గుర్రు పెడుతూ
కమ్యూనిజం దాస్యం
ఈ దశాబ్దంలో అంతమవుతుందన్నాడు
మరి కొన్నేళ్ళ తరువాత
యూరీగగారిన్ ఏం చేశాడు
అమెరికా భూముల సముద్రాల
వైశాల్యాలమీదుగా
మానవులకు తన అభినందనలందజేస్తూ
థామస్ మాన్ సరిగానే అన్నాడు
కమ్యూనిజం వ్యతిరేకత
ఇరవయ్యో శతాబ్దం వేసిన వెర్రితల అంటూ
కానీ ఇప్పటికీ
స్వార్థచింతనా స్వలాభాపేక్షా
వాటి జంజాటం ఆపలేదు
వాటి హత్యలవి జరిపిస్తూనే ఉన్నాయి
ఇప్పటికీ కూడా ......
రచన : ఒటోరినీ కాస్టిలో
మహాకవి శ్రీ శ్రీ : మరో ప్రస్థానం

0 comments:
Post a Comment