Wednesday, July 6, 2011

ఎవరిది అహింస ?




తలకాయలు దొర్లా
లన్నాడు  బిర్లా
ఔను చెరుకూరి తలకాయ దొర్లింది
 చంద్రుడి తలకాయ దొర్లింది ఇదే హింస

బోర్లా
పడుకొన్న సంపాదకా విను
నక్సలైట్లు  ఛేదిస్తున్నారు గాంధీ
విగ్రహాల శిరస్సులను  - అదే అహింస
రాజశేఖరునికి  చావులేదు
హేముడు బతికే ఉంటాడు

లోగా
పురాణాలు పుక్కిలించిన
కిరాణా కవులంతా
నక్సలైట్  నరకాసురుణ్ణెదిరించి
సినిమా తార సత్యభామ
ధనస్వామ్య  దామోదరుణ్ణి  రక్షిస్తుందని
అమాయకంగా నమ్ముతారు  
(రెండు పదాల మార్పులతో) 
మహాకవి శ్రీశ్రీ  - మరోప్రస్థానం 

0 comments:

Post a Comment